సినిమా త‌ర్వాతే హెల్త్ అంటున్న ఎన్టీఆర్‌

ntr

ఒక ప‌క్క రిలీజ్ డేట్ ముంచుకొచ్చేస్తోంది.. సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు.. మ‌రోప‌క్క ఒంట్లో బాగాలేదు.. నీర‌సం అని విశ్రాంతి తీసుకుంటే సినిమా లేట్ అయిపోతుంది.. అందుకే ఎన్ని ఇబ్బందులున్నా `నాన్న‌కు ప్రేమ‌తో` సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్‌.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు ఎన్టీఆర్‌. “నాన్నకు ప్రేమతో” సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మంచి ఉపు మీద ఉన్నాడు. అందుకే జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా లాస్ట్ సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
అయితే కొన్ని రోజులుగా బాగా జ్వరంతో బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. అయినా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.. ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌డంతో.. ఎన్టీఆర్ కోసం రకరకాల స్టెప్స్ కంపోజ్ చేశార‌ట డాన్స్ మాస్ట‌ర్‌. అయితే వాటిని చూస్తూ ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా తూలి కింద పడిపోయాడు ఎన్టీఆర్. దీంతో యూనిట్ స‌భ్యులంతా కంగారుప‌డిపోయార‌ట‌. పెద్దగా దెబ్బలు ఏమి తగలలేదు కానీ చాలా నీర‌సంగా ఉన్నాడ‌ని తెలిసి.. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొమ్మని హీరోయిన్ రకుల్ తో పాటు చిత్ర యూనిట్ కూడా చెప్పింద‌ట‌. కానీ అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేద‌ట‌. మ‌రీ బ‌ల‌వంతం పెడితేగానీ ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోలేద‌ట‌.
ఇలా వెళ్లాడో లేదో మ‌ళ్లీ వెంట‌నే వచ్చేసి షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయిపోయాడ‌ట ఎన్టీఆర్. ఇది చూసిన ర‌కుల్, చిత్ర‌బృందం ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. వ‌ర్క్ పట్ల ఎన్టీఆర్‌కు ఉన్న డెడికేష‌న్ చూసి అవాక్క‌య్యార‌ట‌. అనారోగ్యంగా ఉంటే షూటింగ్‌కి పేక‌ప్ చెప్పేసి హాయిగా విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. కానీ త‌న వ‌ల్ల సినిమా షూటింగ్ నిలిచిపోకూడ‌ద‌ని.. త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోకుండా ఉండ‌టం జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌కే చెల్లింది. సినిమా ప‌ట్ల తార‌క్‌కు ఉన్న అభిమానం చూస్తే ద‌టీజ్ తార‌క్ అన‌క త‌ప్ప‌దు.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌