ఎన్టీఆర్ సినిమాకు విడుదలకు ముందే భారీ ధర

nannaku-prematho-pre-releas

ప్రీ రిలీజ్ బిజినెస్. ఇప్పుడంతా ఇదేమాట‌! కోలీవుడ్ టు టాలీవుడ్‌.. బాలీవుడ్ టు హాలీవుడ్‌. ఓ సినిమా నిర్మాణ ద‌శలోనే బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను పూర్త‌వుతుండ‌డం ఇటీవ‌ల కాలంలో వ‌స్తోన్న ట్రెండ్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, బాహుబ‌లి – 2 చిత్రాలు అప్పుడే త‌మ హ‌వా ఏంటో చాటాయ్‌. ఇప్పుడు బుడ్డోడు వంతు వచ్చేసింది.
షో.. బిజ్ అదుర్స్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌, క్రియెటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబోలో.. వస్తున్న నాన్నకు ప్రేమతో రిలీజ్‌కు ముందే బిజినెస్‌లో తన హవా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ లండన్‌లో షూటింగ్ జరపుకుంటోంది.సెప్టెంబ‌ర్ 20 నుంచి ఈ మూవీ షెడ్యూల్‌ సిరియాలో జరగనుంది.దాదాపు 90 శాతం నాన్నకు ప్రేమతో షూటింగ్ అబ్రాడ్‌లో సాగుతుంది.సినిమాపై నానాటికీ క్రేజ్ పెరిగిపోతుండ‌డంతో.. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగిపోతోంది. నాన్నకు ప్రేమతో శాటిలైట్‌ రైట్స్‌ను జెమిని ఛానెల్‌ అత్యధిక రేటుకు ద‌క్కించుకుంది.దీంతో బ‌య‌ర్లు కూడా సినిమా విడుద‌ల హ‌క్కులు పొందేందుకు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. అన్న‌ట్లు నిన్న‌మొన్న‌టి టెంప‌ర్ కూడా జెమిని వారే ద‌క్కించుకుని, మంచి లాభాలుచూశారు.సంక్రాంతి బ‌రిలో దిగ‌నున్న ఈ సినిమాను చ‌త్ర‌ప‌తి ప్ర‌సాద్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ వారి భాగ‌స్వామ్యంతో నిర్మిస్తున్నారు. గ‌తంలో ఊస‌ర‌వెల్లి, అత్తారింటికి దారేది సినిమాల‌ను నిర్మించిది ఈయ‌నే! దేవీశ్రీ స్వ‌రాలు స‌మ‌కూరుస్తుండ‌గా, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌