బాల‌య్య‌తో జ‌గ‌న్ భేటీ

0120140241

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారా? ఐతే.. ఎప్పుడు? ఎక్క‌డ‌? అని మ‌థ‌న‌ప‌డుతున్నారా..? ఆతృత చెందుతున్నారా? ఆగ‌డాగండి ఆత్ర‌మో / ఆవేశ‌మో ఆపుకోండి.ఇంత‌కూ జ‌రిగిందేంటంటే..వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి కుమారుడి వివాహం సంద‌ర్భంగా బాలయ్య, జగన్ ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ్డారు.ఈ సంద‌ర్భంగా..నవ్వుతూ పలకరించుకుని, అక్క‌డి వాతావ‌ర‌ణంలో ఆహ్లాదం నింపారు.వాస్త‌వానికి ఈ శుభకార్యానికి పిలిచేందుకే జగన్ ..భూమనతో కలిసి సెప్టెంబర్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి.. మీడియామొగ‌ల్‌తో భేటీ అయ్యారు.అప్ప‌ట్లో ఈ వార్త పెను సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే!ఏదేమైన‌ప్ప‌టికీ పార్టీలకతీతం గా టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు అగ్ర నాయకులు ఈ వేడుక‌కు హాజరవడం విశేషం.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం.స‌న్నాఫ్ భూమ‌న వెడ్డింగ్ వేడుక‌కు త‌ర‌లివ‌చ్చిన వారిలో.. రామోజీరావు, దాసరి నారాయణరావు, చిరంజీవి, రాఘవేంద్రరావు, నిమ్మగడ్డ ప్రసాద్, మోహన్ బాబు, సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి ఎన్.వి.రమణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, రఘువీరారెడ్డి, దేవినేని నెహ్రూ, సీఎం రమేష్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారు.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌