అల్లు అర్జున్‌కు అల్లుడు శీను షాక్‌ !

అల్లు అర్జున్‌కు అల్లుడు శీను షాక్‌ !

045045010111

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న (వ‌ర్కింగ్ టైటిల్ స‌రైనోడు) సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను సంక్రాంతికి
రిలీజ్ చేయనున్న‌ట్టు కూడా ఎనౌన్స్ చేయ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు స‌రైనోడు సినిమా లుక్ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ పోస్టర్ విడుదల చేసినా.. అది ఫస్ట్ లుక్ కాదు అందులో టైటిల్ కూడా లేదు. దీంతో సంక్రాంతి లుక్‌లో టైటిల్‌పై కూడా అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్‌మెంట్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో బ‌న్నీ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారు.
 అయితే బ‌న్నీ-బోయ‌పాటి మూవీ త‌ర్వాత చాలా సైలెంట్‌గా స్టార్ట్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఇంచుమించు ఇదే టైటిల్‌తోనే వ‌చ్చేస్తోంది. అల్లుడుశీను త‌ర్వాత బెల్ల‌కొండ శ్రీనివాస్ – భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. స్పీడున్నోడు టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశారు. లేట్ గా మొదలుపెట్టినా.. ఈ కుర్రోడు బాగా స్పీడ్ గానే అనౌన్స్ చేసేశాడు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సరైనోడు టైటిల్ ప్రకటించి జ‌నాల్లోకి వెళితే అది స్పీడున్నోడును స‌రైనోడు కాపీ కొట్టిన‌ట్టు ఉంటుద‌న్న టాక్ వ‌స్తోంది. అందుకే టైటిల్ విషయంలో మార్చి తీరాలని బన్నీ పట్టు పడుతున్నాడని టాక్. ఇప్పటికే బోయపాటి దగ్గర రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ఉన్నాయని.. వీటిలో ఏదో ఒకటి ఫస్ట్ లుక్ నాటికి ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ – కేథరిన్ థెరెసాలు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌