కాల్‌రికార్డింగ్‌తో బుక్ అయిన టీ బీజేపీ ఎమ్మెల్యే

0950560630230

కాల్‌రికార్డింగ్ దెబ్బ‌కు మ‌రో ఎమ్మెల్యే బుక్క‌య్యాడు.. మ‌నుషులు ఎప్పుడూ రెండు ర‌కాలుగా ఉంటారు. పైకి క‌నిపించే వ్య‌క్తి ఒక‌రైతే.. లోప‌లున్నది మ‌రో వ్య‌క్తి. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కులు ఈ రెండో వ్య‌క్తిని క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేస్తుంటారు.. అలా త‌న‌లో ఉన్న రెండో వ్య‌క్తిని బ‌య‌ట‌కు తీసి అడ్డంగా దొరికిపోయాడు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్.
ఒక‌ప‌క్క గుడుంబా కేసు.. మ‌రోప‌క్క రాజ‌కీయ స‌మ‌స్య‌లు..ఇలా వ‌రుస‌గా స‌త‌మ‌త‌మైపోతున్నారు రాజాసింగ్‌. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా ప‌రువు పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడు.. గోషామహల్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్‌లో ఒక వ్యక్తి తన ఇంటి వద్ద బోర్ వేయడానికి రెడీ అయ్యారు.. దీనిని రెవెన్యూ అధికారులు వచ్చి ఆపేశారు. కేసు పెడతామని హెచ్చరించారు. త‌న‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుసని ఫోన్ చేశారు. తొలుత ఎమ్మెల్యేతో విష‌యం చెప్పాడు.. ఫోన్ ఆ అధికారికి ఇవ్వాల‌ని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇక‌ తన పని అయిపోయినట్టే అనుకుని రెవెన్యూ అధికారికి ఫోన్ ఇచ్చాడు.
రాజాసింగ్ లోపలి మనిషి అప్పుడు బయటపడ్డాడు. “వాడు చెత్త నాకొడుకు… వ‌దిలిపెట్టవద్దు. కేసు పెట్టు. ఎంత ఫైన్ వేయగలరో వేయండి. ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టవద్దు” అని అధికారికి చెప్పాడు. అయితే తాను ఇలా చెప్పినట్టు చెప్పకుండా ఫైన్ వేయాలని అధికారులకు చెప్పారు. ఎమ్మెల్యేనే అలా అంటే..ఇంకేంటి.. అధికారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కాదు ఎవరు చెప్పినా వినేప్రసక్తే లేదంటూ బోర్ వేయకుండా అడ్డుపడ్డారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ, ఫోన్ చేసిన ఆ బోరు వేసుకుంటున్న వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేయడానికి ముందే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేశాడు. దీంతో మొత్తం సంభాషణ రికార్డయింది. ఇదంతా విన్న అధికారికి దిమ్మతిరిగిపోయింది. ఆయన నుంచి అది సోషల్ మీడియాలోకి చేరేసరికి ఎమ్మెల్యేలోని రెండో మనిషి అందరికీ పరిచయం అవుతున్నాడు. దీంతో `మా ఎమ్మెల్యే ఇలాంటి వాడా?` అని నివ్వెర‌పోతున్నారు. మ‌రి ఓట్లు అడిగేట‌ప్పుడు కాళ్లు ప‌ట్టుకుని.. త‌ర్వాత ఏదైనా స‌మ‌స్య వ‌చ్చింద‌ని చెబితే ఇలా వాళ్లే జుట్టు ప‌ట్టుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌