ప్ర‌భాస్ సినిమాలో చెర్రీ

0545040210

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండదండలతో అతని స్నేహితులు వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి యు.వి.క్రియేషన్స్ స్థాపించి సక్సెస్ ఫుల్ గా ముందుకుసాగుగున్న సంగతి తెలిసిందే! ఈ బ్యానర్ ప్రభాస్ సొంత బ్యానర్ లాంటిది. తొలి ప్రయత్నంగా ప్రభాస్ హీరోగా ‘మిర్చి’ చిత్రాన్ని నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’, గోపీచంద్ హీరోగా ‘జిల్’ చిత్రాలను నిర్మించి వరుస విజయాలను చవిచూశారు. గీతా ఆర్ట్స్ – 2తో చేతులు కలిపి నాని హీరోగా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని నిర్మించి భారీ లాభాలు అందుకున్నారు. ఇక ప్రభాస్ అండదండలతో ‘బాహుబలి’ చిత్రం తమిళ హక్కులను దక్కించుకుని కోలీవుడ్ లో కూడా తమ సత్తాని చాటుకున్నారు. ‘బాహుబలి 2’ తో పాటు యు.వి.క్రియేషన్స్ కి కూడా ప్రభాస్ ఓ సినిమా చేసే ఆలోచనలో ప్రస్తుతం ఉన్నట్టు వార్తలు ఉన్నాయి. గ‌త కొన్ని రోజులుగా మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్న యూవీ క్రియేష‌న్స్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా చేతులు కలిపాడని వినికిడి.
“జిల్ ” జిల్ జిగ‌..
తాజాగా యూవీ క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్ అధినేత‌లు వంశీ, ప్రమోద్ ఓ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. రాంచరణ్ హీరోగా ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట! రాంచరణ్ కూడా ఈ సంస్థలో సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చినట్టు సమాచారమ్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. తమిళ్ చిత్రం ‘ థ‌ని ఒరువన్’ తెలుగు రీమేక్ లో రాంచరణ్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే యూవీ వారి చిత్రం మొద‌లుకానుంది. మ‌నోడు ఇక్క‌డైనా స‌క్సెస్ కొడ‌తాడో ? లేదో?
please share it..

Comments

Popular posts from this blog

అక్రమంగా రూపొందించడిన స్కార్పియో కారును జప్తు చేసిన ముంబైయ్ పోలీస్ అధికారులు

అర నిమిషంలో సినిమా డౌన్‌లోడ్‌