‘బాహుబలి-2’ లో అత‌డెందుకు?

21202020120

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి-2’ టీంలో కొత్త విల‌న్ ఎంట‌ర‌య్యాడు.‘నాథన్ జోన్స్’ అనే హాలీవుడ్ న‌టుడినిఇక్క‌డ న‌టింప‌జేసేందుకు జ‌క్క‌న్న స‌న్నాహాలు చేస్తున్నాడు.ఇంత‌కూ ఈయ‌న గారి ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసా? ఈయ‌న అలాంటి..ఇలాంటి విలన్ కాదు భారీకాయుడు. 6 అడుగులా 10అంగుళాల పొడవు, 145 కిలోల బరువు ఉన్న విలన్.ప్రొఫెషనల్ రెజ్ల‌ర్‌.వెయిట్ లిఫ్టర్ కూడా..! గ‌తంలో జోన్స్‌కూ భార‌తీయ సినిమాకూ మంచి అనుబంధ‌మే ఉంది. కోలీవుడ్ లో జయం రవి నటించిన భూలోగం అనే సినిమాలో జోన్స్ ఓ విలన్ పాత్ర పోషించాడు.ఇప్పుడు బాహుబలిలో ఇతను కాలకేయ తరహా విలన్ పాత్ర పోషించబోతున్నాడని స‌మాచారం.పాత్ర చిన్నదే అయినా కీలక సన్నివే శాల్లో ఆయ‌న రాక ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తుంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.ఇదే గనక నిజమైతే రాజమౌళి బాహుబలి అబిమానులకు మరో గొప్ప అనుభూతిని అందివ్వడం ఖాయం.ఐతే.. ఇందుకు సంబంధించి రాజ‌మౌళి మాత్రం ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.
please share it..

No comments:

Post a Comment

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము?

కరోనా కోవిడ్ -19 గురించి ఏ వికీపీడియా మీకు చెప్పలేము? మిమ్మల్ని మీరు రక్షించుకోండి  Your మీ చేతులను తరచుగా కడగాలి Eyes మీ కళ్ళు, న...