పవన్ ని కాపి కొట్టిన బాలీవుడ్

పవన్ ని కాపి కొట్టిన బాలీవుడ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రచించి , దర్శకత్వం వహించిన ' జానీ ' చిత్రం 2003 లో విడుదలై  బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ చిత్రంలో  క్యాన్సర్ తో భాదపడుతున్న తన భార్య (హీరోయిన్ రేణు దేశాయ్) ని కాపాడడానికి పవన్ ఓ స్ట్రీట్ ఫైటర్ గా మారి డబ్బు సంపాదిస్తుంటాడు. సరిగ్గా ఈ లైన్ ని  లిఫ్ట్ చేసి  బాలీవుడ్ లో  ఫ్రీ మేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ ,రణదీప్ హూడా లు జంటగా నటిస్తున్న 'దొ లఫజాన్ కి కహాని' చిత్రం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రం లో కాజల్ గుడ్డి అమ్మాయిల నటిస్తోంది. ఈ గుడ్డి  అమ్మాయి తో ప్రేమలో పడ్డ హీరో రణదీప్ హూడా , కాజల్ కి కళ్ళు తెప్పించడానికి కంటి   ఆపరేషన్ కోసం స్ట్రీట్ ఫైటర్ గా మారి డబ్బు సంపాదిస్తుంటాడు. అయితే ఈ చిత్రం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.  'దొ లఫజాన్ కి కహాని' చిత్రం ట్రైలర్ నుచూస్తుంటే పవన్ జానీ సినిమానే గుర్తొస్తోంది. మరి ఈ బాలీవుడ్ మేకర్స్ ఎంత తెలివిగా పవన్ కళ్యాణ్ 'జానీ' చిత్రాన్ని లిఫ్ట్ చేశారో తెలియాలంటే వచ్చే వాలంటైన్స్ డే వరకు వేచి చూడాల్సిందే !

Comments

Popular posts from this blog

United Airlines CEO explains why the Boeing 747 jumbo jet will soon go away

Top 5 Free Screen Recording Softwares For Windows

Samsung Galaxy Note 8 Release Date, Price, Specs, Features